- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూతుర్ని కాల్చి చంపిన ట్రంప్ ఫ్యాన్.. రాజకీయ భావాలే కారణమా?
కూతుర్ని కాల్చి చంపిన ట్రంప్ ఫ్యాన్. తుపాకీల విషయంలో రాజకీయ విధానాలపై గొడవే కారణమా?

దిశ, నేషనల్ బ్యూరో: ట్రంప్, తుపాకులపై వాగ్వాదంలో కన్నకూతుర్ని కాల్చిచంపాడో తండ్రి. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో వెలుగు చూసింది. చెషైర్‌కు చెందిన బ్రిటన్ యువతి లూసీ హారిసన్ తండ్రి క్రిస్.. టెక్సాస్‌లో ఉంటున్నాడు. అతన్ని కలిసేందుకు బాయ్‌ఫ్రెండ్ శామ్ లిట్లర్‌తో కలిసి లూసీ తాజాగా టెక్సాస్‌లోని ప్రాస్పర్‌కు వచ్చింది. ట్రంప్, తుపాకీ సంప్రదాయం అంటే లూసీకి గిట్టదు. క్రిస్ మాత్రం ట్రంప్, రిపబ్లికన్ పార్టీకి అభిమాని. ఈ విషయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదాలు సాధారణంగా జరుగుతూన ఉంటాయని కుటుంబ సభ్యులు తెలిపారు. తుపాకీలంటే లూసీకి చాలా అయిష్టం. అలాంటిది క్రిస్ ఒక తుపాకీ కొంటానని అనడంతో ఆమె బాగా అప్‌సెట్ అయింది.
ఇదిలా వుండగా.. జనవరి 10వ తేదీన వంట గదిలో ఉన్న లూసీని క్రిస్ తన గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కాసేపటికి పెద్ద చప్పుడు వచ్చిందని, పైకి వెళ్లి చూస్తే రక్తపు మడుగులో పడి ఉన్న లూసీ ఎదురుగా నిలబడి క్రిస్ అరిచి కేకలు పెడుతున్నాడని కోర్టుకు శామ్ తెలియజేశాడు. గతంలో మద్యానికి బానిసై రీహాబిలేషన్ తీసుకున్న క్రిస్.. ఆరోజు తాను అరలీటర్ వైన్ తాగానని, కొత్తగా కొన్న తుపాకీని లూసీకి చూపించేందుకే గదిలోకి తీసుకెళ్లానని కోర్టులో చెప్పాడు. ఆ సమయంలో పెద్ద చప్పుడవడం, లూసీ పడిపోవడమే తనకు గుర్తుందని, అది ఎలా జరిగిందో తనకు గుర్తులేదని అన్నాడు. అయితే కూతుర్ని తనే షూట్ చేశానని, ఆ బాధ ఎన్నటికీ పోదని చెప్పాడు.






