- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trump: ఫెడరల్ ఉద్యోగులకు బెదిరింపులు.. మస్క్ నిర్ణయాన్ని సమర్థించిన ట్రంప్
ఫెడరల్ ఉద్యోగులకు బిలియనీర్ ఎలాన్ మస్క్(Elon Musk) ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఫెడరల్ ఉద్యోగులకు బిలియనీర్ ఎలాన్ మస్క్(Elon Musk) ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఉద్యోగులంతా ప్రభుత్వం కోసం గతవారం ఏంపనిచేశారో వివరించాలని సోమవారం అర్ధరాత్రి వరకు డెడ్ లైన్ పెట్టారు. కాగా.. గడువు ముగియనున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దీనిపై స్పందించారు. మస్క్ డిమాండ్ ను ట్రంప్ సమర్థించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఉద్యోగులు నిజంగా పనిచేస్తున్నారా? అని మస్క్ అడుగుతున్నారు. ఒకవేళ మీరు దీనికి బదులివ్వకపోతే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించినట్లే. చాలామంది మస్క్ మెయిల్ కు జవాబిచ్చేందుకు రెడీగా లేరు. ఎందుకంటే వారు అసలు ఉనికోలేనే లేరు. మస్క్ నేతృత్వంలోని డోజ్.. ప్రభుత్వంలో జరుగుతున్న వందల బిలియన్ డాలర్ల మోసాన్ని గుర్తించింది. గతంలో విధుల్లో లేని వారికి కూడా జీతాలు ఇచ్చినట్లు సమాచారం అందింది’’ అని ట్రంప్ అన్నారు.
ఉద్యోగులకు మస్క్ మెయిల్
కాగా.. ఫెడరల్ ఉద్యోగులకు యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ (OPM) నుంచి మస్క్ మెయిల్ పంపారు. ఉద్యోగులందరూ గతవారం ప్రభుత్వం కోసం ఏం పని చేశారో వివరించాలని.. సోమవారం రాత్రి 11.59లోగా రిప్లయ్ ఇవ్వాలని అన్నారు. లేదంటే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తానని చెప్పుకొచ్చారు. అయితే, ఈ మెయిల్ పై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అయితే, మస్క్ గడువును కొన్ని కీలక ఫెడరల్ విభాగాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆయన ఆదేశాలకు స్పందించాల్సిన అవసరం లేదని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, తులసీ గబ్బార్డ్ సహా పలువురు తమ విభాగాల్లోని ఉద్యోగులకు సూచించారు. అటు ఓపీఎం కూడా దీనిపైన స్పందించినట్లు తెలుస్తోంది. మస్క్ మెయిల్ కు రిప్లయ్ ఇవ్వకపోతే ఉద్యోగాల నుంచి తొలగించబోమని పేర్కొన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. మెయిల్ పై నిర్ణయం ఉద్యోగుల ఇష్టపూర్వకమే అని ఓపీఎం పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే, మస్క్ నిర్ణయంపై రిపబ్లికన్లు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల దేశభద్రతకు సంబంధించిన విషయాలు బయటకు పోయే ప్రమాదం ఉందనే భయాలు నెలకొన్నాయి. ఇకపోతే, ఈ పరిణామాలపై మస్క్ కూడా స్పందించారు. సోమవారం అర్ధరాత్రి లోపు రిప్లయ్ ఇవ్వనివారికి రెండో అవకాశమిస్తానని వెల్లడించారు. అప్పుడు కూడా బదులివ్వకపోతే ఉద్యోగాల నుంచి తొలగించడం తప్పదని స్పష్టం చేశారు.






