ఆ ప్రాంతాన్ని ఇండియాలో కలుపుతూ అమెరికా కొత్త మ్యాప్!

by velandi.Saikiran |

పాక్ ఆక్రమిత కాశ్మీర్ సహా మొత్తం జమ్మూ కాశ్మీర్ ను ఇండియా భూభాగంగా పేర్కొంటూ అమెరికా తాజాగా కొత్త మ్యాప్ రిలీజ్ చేసింది.

ఆ ప్రాంతాన్ని ఇండియాలో కలుపుతూ అమెరికా కొత్త మ్యాప్!
X

దిశ‌, వెబ్ డెస్‌: ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్ వర్క్ కూడా ఖరారు అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇండియాకు సంబంధించిన మ్యాప్ ను అమెరికా విడుదల చేసింది. ట్రేడ్ డీల్ పై ట్రంప్ యంత్రాంగం రూపొందించిన భారతదేశం మ్యాప్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ మ్యాప్ అమెరికా రిలీజ్ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్, అటు చైనా దేశాలు కంగుతిన్నాయి.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ సహా మొత్తం జమ్మూ కాశ్మీర్ ను ఇండియా భూభాగంగా పేర్కొంటూ అమెరికా తాజాగా కొత్త మ్యాప్ రిలీజ్ చేసింది. అదే సమయంలో చైనా తన భూభాగంగా వాదించే ఆక్సాయ్‌ చిన్ ప్రాంతం కూడా ఇండియాదే అన్నట్లుగా పేర్కొంది. ఇండియా ప్రాదేశిక సర్వభూమాత్వాన్ని ధ్రువీకరించడానికి అమెరికా ఆమోదం అసలు అవసరం లేదు. మొదటి నుంచి కాశ్మీర్ ఇండియాదే. ఇదే విషయాన్ని మోడీ ప్రభుత్వం కూడా స్పష్టం చేస్తుంది. అయితే గతంలో అమెరికా విడుదల చేసిన ఇండియన్ మ్యాప్ మాత్రం, పాకిస్తాన్ వాదనకు అనుగుణంగా ఉండేదని అంటున్నారు. కానీ ఇప్పుడు చైనాతో పాటు పాకిస్తాన్ కు షాక్ ఇచ్చేలా ఇండియా మ్యాప్ రిలీజ్ చేసింది ట్రంప్ స‌ర్కార్‌.

Next Story