- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trump: మెక్సికో, ఈయూపై 30శాతం సుంకం.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో, యూరోపియన్ యూనియన్ (ఈయూ) పై 30 శాతం సుంకం విధించారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మెక్సికో, యూరోపియన్ యూనియన్ (EU) పై 30 శాతం సుంకం విధించారు. ఆగస్టు 1 నుంచి ఈ టారిఫ్ అమల్లోకి రానున్నట్టు తెలిపారు. తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్రూత్ సోషల్‌లో శనివారం ప్రకటన చేశారు. మెక్సికో, ఈయూలకు పంపిన టారిఫ్ లేఖలను వెల్లడించారు. మెక్సికో అమెరికాలోకి అక్రమ వలసదారుల రవాణాను, ఫెంటానిల్ వంటి మాదకద్రవ్యాలను ఆపడంలో కొంతవరకు సహాయపడిందని తెలిపారు. కానీ ఉత్తర అమెరికా నార్కో-ట్రాఫికింగ్ ప్లే గ్రౌండ్‌గా’గా మారకుండా ఆపడంలో మెక్సికో విఫలమైందని అందుకే 30 శాతం సుంకం విధించాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు.
అలాగే ఈయూ వాణిజ్యం పూర్తిగా ఏకపక్షంగా ఉందని, దాని వల్ల అమెరికాకు ప్రమాదమని తెలిపారు. ప్రతీకార చర్యలకు పాల్పడితే సుంకాలను మరింత పెంచుతామని హెచ్చరించారు. కాగా, ఈయూ, మెక్సిలో యూఎస్‌తో కొంత కాలంగా చర్చలు జరుపుతున్నాయి. కానీ డీల్ కుదరకపోవడంతోనే ట్రంప్ టారిఫ్‌లను ప్రకటించినట్టు తెలుస్తోంది.






