- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం కూలిపోతుంది
వేలాది కోట్ల రూపాయలు హవాలా ద్వారా ఆస్ట్రేలియాతో పాటు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లాయి. ఈ డబ్బంతా మద్యం, భూమి వినియోగంలో మార్పులు చేయడం ద్వారా సంపాదించిందే అని ఆయన ఆరోపించారు.

- 32 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు
- ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూల్చదు
- బీజేపీనే ఆ పని చేస్తుంది
- పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బాజ్వా
దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది. మాతో 32 కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా అన్నారు. ఇంకొంత మంది బీజేపీతో మాట్లాడుతున్నారు. అయితే భగవంత్ మాన్ ప్రభుత్వం పడిపోతే దానికి బీజేపీనే బాధ్యత. కానీ కాంగ్రెస్‌ది ఏ మాత్రం కాదని ఆయన చెప్పారు. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా మంత్రులు, ఇతర బడా నాయకులు కూడా మాతో టచ్‌లోకి వచ్చారు. అయితే ఆప్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అస్థిరపరచదని ప్రతాప్ సింగ్ బజ్వా చెప్పారు. ఆప్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు మనుగడలో ఉంటుంది. అప్పుడు ప్రజలకు తాము ఎన్నుకున్న ప్రభుత్వం ఎలాంటిదో అర్థమవుతుందని చెప్పారు.
వేలాది కోట్ల రూపాయలు హవాలా ద్వారా ఆస్ట్రేలియాతో పాటు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లాయి. ఈ డబ్బంతా మద్యం, భూమి వినియోగంలో మార్పులు చేయడం ద్వారా సంపాదించిందే అని ఆయన ఆరోపించారు. దీనికి ఆప్ నాయకులే బాధ్యత వహించాలని చెప్పారు. పంజాబ్‌లో ఢిల్లీ మోడల్ అమలు చేస్తున్నామని సీఎం చెప్తున్నారు. ఆప్ నాయకులు భారీగా ప్రజల సొమ్మును దోచేస్తూ ఢిల్లీ మోడల్‌ను నిజం చేశారని ఎద్దేవా చేశారు. కాగా, ప్రతాప్ సింగ్ బాజ్వా వ్యాఖయలపై ఆప్ కూడా స్పందించింది. ప్రతాప్ బాజ్వా ఇప్పటికే బీజేపీ నుంచి టికెట్ హామీని పొందారు. బెంగళూరులో ఓ సీనియర్ బీజేపీ నాయకుడిని బాజ్వా కలిశారని ఆప్ నాయకులు నీల్ గర్గ్ చెప్పారు. ప్రతాప్ బజ్వా మీద రాహుల్ గాంధీ ఒక కన్నేసి ఉంచాలని సూచించారు. కాగా, ఢిల్లీలో ఆప్ ఓడిపోయిన తర్వాత భగవంత్ మాన్ ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటోంది.






