- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంపూర్ణ అక్షరాస్యత సాధించిన లిస్ట్ లోకి మరో రాష్ట్రం
అక్షరం... ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును నింపుతుంది. అందుకే పేద ధనిక, కులమత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరిని

దిశ, వెబ్ డెస్క్: అక్షరం... ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును నింపుతుంది. అందుకే పేద ధనిక, కులమత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరిని చదివించాలని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క పౌరుడు చదివితేనే దేశానికి వెలుగు. అయితే 100కు 100%.. అక్షరాస్యతను పెంపొందించేలా చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ఇప్పటివరకు... అక్షరాస్యతలో మిజోరాం అలాగే గోవా రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి.
జాతీయ విద్యా విధానం 2020 కి అనుగుణంగా మిజోరం అలాగే గోవా రాష్ట్రాలు ముందుకు సాగుతున్నాయి. సంపూర్ణ అక్షరాస్యతను (Full literacy ) సాధిస్తున్నాయి. అయితే సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రాల లిస్టులో ఇప్పుడు త్రిపుర ( Tripura) కూడా చేరింది.
ఈ మేరకు ఇవాళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి... మాణిక్ సహా అధికారికంగా ప్రకటించారు. 1961 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 20.24 శాతం మాత్రమే ఉంది. అయితే 2011 వచ్చే సమయానికి 87.22 శాతంగా నమోదయింది. ఇక తాజాగా.. త్రిపుర అక్షరాస్యత రేటు 95.6% పెరిగింది. ఈ నేపథ్యంలోనే... సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మూడో రాష్ట్రంగా త్రిపుర నిలిచింది.






