JAMMU KASHMIR: ఉగ్రవాదులను ఉరికించేందుకు బార్డర్‌లో తుపాకులు పట్టిన గ్రామస్తులు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-31 06:42:12  IST  )

జ‌మ్మూక‌శ్మీర్‌లో గ్రామ రక్షణ దళాలకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. టెర్రరిజంపై పోరులో భాగంగా కేంద్రం వీడీజీలను నియమించింది. అటవీ పర్వతాల ఒడ్డున నివసిస్తున్న గ్రామాలకు చెందిన వారికి శిక్షణ ఇస్తోంది.

JAMMU KASHMIR: ఉగ్రవాదులను ఉరికించేందుకు బార్డర్‌లో తుపాకులు పట్టిన గ్రామస్తులు
X

దిశ‌, వెబ్ డెస్క్: జ‌మ్మూక‌శ్మీర్‌లో గ్రామ రక్షణ దళాలకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. టెర్రరిజంపై పోరులో భాగంగా కేంద్రం వీడీజీలను నియమించింది. అటవీ పర్వతాల ఒడ్డున నివసిస్తున్న గ్రామాలకు చెందిన వారికి శిక్షణ ఇస్తోంది. ఇందులో భాగంగా దోడా- చంబా ప్రాంతాలకు చెందిన 17 గ్రామాల‌కు చెందిన 150మందికి రైఫిల్స్, వ్యూహాలు ర‌చించ‌డం, ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ఆర్మీ అధికారులు శిక్ష‌ణ ఇస్తున్నారు. ఇందులో మ‌హిళ‌ల‌ను సైతం భాగ‌స్వామ్యం చేశారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ఈ నిర్ణ‌యంపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే స‌రిహ‌ద్దు ప్రాంతాల్లోనే ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో క‌శ్మీర్ లో ఉగ్రవాదుల‌కు చెక్ పెట్టేందుకే అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌రోవైపు గ్రామ‌స్తులు సైతం ఆయుధాల‌ను ఉప‌యోగించ‌డం నేర్చుకునేందుకు ఆస‌క్తిచూపిస్తున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా మందుకు వ‌స్తున్నారు. video

Next Story