- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్‌ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురి మృతి
పట్టాలు దాటుతున్న సమయంలో దూసుకొచ్చిన రైలు.. ఓ బైక్ ను ఢీ కొట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: పట్టాలు దాటుతున్న సమయంలో దూసుకొచ్చిన రైలు.. ఓ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు. క్రిస్మస్ పండుగ వేళ జరిగిన ఈ ఘోరప్రమాదం ఆ కుటుంబలో విషాదాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పుర్ లో ఈ ప్రమాదం జరగ్గా.. మృతులంతా బైక్ పైనే వెళ్తున్నట్లు పోలీసులు నిర్థారించారు.
బుధవారం సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో ప్యాసింజర్ రైలు లక్నో వైపు వెళ్తుండగా.. అదే సమయంలో బైక్ ట్రాక్ దాటేందుకు ప్రయత్నించింది. రైలు రావడాన్ని గమనించకుండా వెళ్లడంతో కుటుంబమంతా రైలు ప్రమాదంలో మరణించింది. మృతులను సేత్ పాల్ (40), అతని భార్య పూజ (38), సేత్ పాల్ బావమరిది హరి ఓమ్ (45), నాలుగు, ఆరేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. నిగోహి గ్రామంలో హరి ఇంటికి వెళ్లి.. అతనితో కలిసి తిరిగి తమ స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టంకు తరలించారు.






