Tragedy: బాగ్పత్‌లో కుప్పకూలిన వేదిక.. ఏడుగురు దుర్మరణం, 60 మందికి గాయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-28 06:20:24  IST  )

ఉత్తర్ ప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రంలో ఘోరం చోటుచేసుకుంది.

Tragedy: బాగ్పత్‌లో కుప్పకూలిన వేదిక.. ఏడుగురు దుర్మరణం, 60 మందికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రంలో ఘోరం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాగ్పత్‌ (Baghpat)లో ఇవాళ అట్టహాసంగా నిర్వహిస్తోన్న లడ్డూ మహోత్సవం (Laddu Mahotsavam)లో అపశృతి చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సహాయక చర్యలను వేగవంతం చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అయితే, లడ్డూల కోసం పోటీపడిన భక్తులు ఒక్కసారిగా వేదికపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది. వెదురు కర్రలతో ఆ వేదికను నిర్మించడంతో ఒక్కసారిగా కుప్పకూలినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story