- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tragedy: భారత రాజకీయాల్లో తీవ్ర విషాదం.. మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
భారత రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: భారత రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత ఎస్ఎం (SM Krishna) కృష్ణ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతోన్న ఆయన ఇవాళ తెల్లవారుజామున బెంగళూరు (Bengaluru)లోని సదాశివనగర్‌లో ఉన్న తన నివాసంలో తుది శ్వాస విడిచారు. తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి ప్రారంభించిన ఆయన 1989-1993 మధ్య కాలంలో కర్ణాటక (Karnataka) శాసననభ స్పీకర్‌గా పని చేశారు. అనంతరం 1993 నుంచి 1994 వరకు కర్ణాటక మొదటి డిప్యూటీ సీఎం (Deputy CM)గా, 1994 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా, 2009 నుంచి 2012 వరకు విదేశాంగ మంత్రిగా పని చేశారు. అనంతరం 2014లో బీజేపీ (BJP)లో చేరిన ఎస్ఎం కృష్ణ (SM Krishna) కొన్నాళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.






