- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవుడికి గిఫ్ట్‌గా 10 కిలోల వెండి పెట్రోల్ పంప్
రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌కు చెందిన ఓ వ్యాపారి తన కల నెరవేరిన సందర్భంగా భిన్నంగా తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌కు చెందిన ఓ వ్యాపారి తన కల నెరవేరిన సందర్భంగా భిన్నంగా తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఎన్నో రోజులుగా తాను పెట్రోల్ బంక్ ప్రారంభించాలని ఆకాంక్షిస్తూ వచ్చిన ఈ వ్యాపారి, ఆ కల నెరవేరిన తరవాత, సన్వాలియా సేథ్ ఆలయానికి ప్రత్యేక కానుకను సమర్పించారు.
తన కృతజ్ఞతలు తెలియజేస్తూ.. దాదాపు 10 కిలోల వెండితో తయారైన పెట్రోల్ పంప్ ఆకారంలోని విగ్రహాన్ని ఆలయానికి అందించారు. కుటుంబ సభ్యులతో కలిసి తలపై మోస్తూ ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నృత్యాలు, సంగీతం, సందడి మధ్య కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవునికి ఈ వెండి పెట్రోల్ పంప్ ను సమర్పించారు.
ఈ అరుదైన ఘట్టానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భక్తుడి విశ్వాసం, ఆత్మీయత, వినూత్న ఆచరణ పట్ల నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే సన్వాలియా సేథ్ ఆలయంలో ఎంతోమంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తరువాత వెండి వస్తువులు, ఇతర కానుకలు సమర్పించడం పరిపాటిగా మారింది. అయితే ఈ సారి సమర్పించిన వెండి పెట్రోల్ పంప్ ఆకృతి మాత్రం భిన్నంగా నిలిచింది.






