Trade deal: త్వరలోనే భారత్‌తో బిగ్ ట్రేడ్ డీల్.. ట్రంప్ కీలక ప్రకటన

by B.Srinivas |

భారత్, అమెరికా మధ్య త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందం జరగబోదుందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

Trade deal: త్వరలోనే భారత్‌తో బిగ్ ట్రేడ్ డీల్.. ట్రంప్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, అమెరికా (India America) మధ్య త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందం జరగబోదుందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. ఇటీవలే చైనాతో ట్రేడ్ డీల్ (Trade deal) కుదుర్చుకున్నామని, ఇదే తరహాలో భారత్‌లోనూ అలాంటి ఒప్పందమే జరుగుతుందని తెలిపారు. వైట్‌హౌస్‌ (White house) లో తాజాగా జరిగిన బిగ్ ‘బ్యూటిఫుల్ ఈవెంట్’లో ట్రంప్ ప్రసంగించారు. ఇండియాతో తమకు మంచి సంబంధాలున్నాయని, ఇరు దేశాల మధ్య గొప్ప డీల్ జరగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరూ తమతో ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారని, దానిలో భాగం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కానీ అమెరికా అన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కురుర్చుకోబోదని స్పష్టం చేశారు. కొంత మందికి లేఖలు పంపి ధన్యవాదాలు చెబుతామని తెలిపారు. వారు 25, 35, 45 శాతం సుంకాలు చెల్లిస్తారన్నారు. కాగా, ట్రేడ్ డీల్ పై అమెరికా, భారత ప్రతినిధులు ఇటీవల నాలుగు రోజుల పాటు విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ట్రంప్ ప్రకటనతో ఇరు దేశాల వాణిజ్య ఒప్పందంపై ఆసక్తి నెలకొంది.

Next Story