కుండపోత వర్షం.. ఇళ్లలోకి చేరిన వరద నీరు (వీడియో)

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-13 11:48:41  IST  )

మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

కుండపోత వర్షం.. ఇళ్లలోకి చేరిన వరద నీరు (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు (Heavy rains in Madhyapradesh) కురుస్తున్నాయి. తికమ్‌గఢ్‌ జిల్లాలో కురిసిన కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. కేవలం 48 గంటల వ్యవధిలో ఈ ప్రాంతంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. అలాగే, చెరువులు, డ్యామ్‌లు నిండుకుండను తలపిస్తున్నాయి.

ఈ వర్షాల నేపథ్యంలో తికమ్‌గఢ్‌ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలను ముందస్తుగా హెచ్చరించినట్లు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ శ్రోట్రియా వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయటంతో ఎలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోలేదని కలెక్టర్‌ తెలిపారు. అయితే నాలాల ఆక్రమణల వల్ల వరదనీరు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్టు అధికారులు గుర్తించారు. దీనివల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. వర్షం తగ్గిన తర్వాత పరిస్థితిని సమీక్షించి తగిన నివారణ చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు తెలిపారు.


Click Here For Video

Next Story