యూఎస్‌లో టోర్నడోల బీభత్సం.. 27 మంది దుర్మరణం

by Phanindra |

యూఎస్‌లో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. వీటి వల్ల 27 మంది దుర్మరణం పాలైనట్లు అధికారులు తెలిపారు.

యూఎస్‌లో టోర్నడోల బీభత్సం.. 27 మంది దుర్మరణం
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్‌లోని మిడ్‌వెస్ట్ ఒహాయో రివర్ వ్యాలీ ప్రాంతాల్లో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. ఈ తుఫానుల్లో 27 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా కెంటక్కీ, మిస్సోరీ, వర్జీనియా ప్రాంతాల్లో ఈ టోర్నడోలు తీవ్రమైన ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి.

ఒక్క కెంటక్కీలోనే 18 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలైనట్లు అధికారులు వెల్లడించారు. మిస్సోరీలో ఏడుగురు మరణించగా, వర్జీనియాలో చెట్లు విరిగి పడటంతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ టోర్నడోల వల్ల వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలు రహదారులను బ్లాక్ చేసిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Next Story