అతన్ని సమాధి నుండి బయటకు లాగుతా.. ఎన్నికల కమిషనర్‌కు టీఎంసీ ఎమ్మెల్యే వార్నింగ్

by Ajay Maddhiboyina |

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ వివాదం కొనసాగుతున్న వేళ టీఎంసీ ఎమ్మెల్యే మోనిరుల్ ఇస్లాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సభలో ప్రసంగిస్తూ ఎన్నికల కమిషనర్ కు వార్నింగ్ ఇచ్చారు.

అతన్ని సమాధి నుండి బయటకు లాగుతా.. ఎన్నికల కమిషనర్‌కు టీఎంసీ ఎమ్మెల్యే వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ వివాదం కొనసాగుతున్న వేళ టీఎంసీ ఎమ్మెల్యే మోనిరుల్ ఇస్లాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సభలో ప్రసంగిస్తూ ఎన్నికల కమిషనర్ కు వార్నింగ్ ఇచ్చారు. ఈ జెండా పనిచేయదు.. ఎన్నికల కమిషన్ ను కర్రతో విరగొట్టాలని అన్నారు. నేను అతన్ని సమాధి నుండి బయటకు లాగుతాను అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీని సంతోషపెట్టడానికే బెంగాల్ లోని ప్రజలను ఎన్నికల కమిషన్ వేధింపులకు గురి చేస్తోందన్నారు. ఎన్నికల కమిషనర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇస్లాం చేసిన వ్యాఖ్యలు బెంగాల్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల కమిషన్ పై దాడి చేస్తానని అనడం, కమిషనర్ ను సమాధి నుండి బయటకు లాగుతానని కామెంట్ చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇస్లాం కామెంట్లపై కాంగ్రెస్ మాజీ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. రాష్ట్రంలో పాలన విచ్ఛినమైందని అన్నారు. దానికి మమతా బెనర్జీనే కారణమన్నారు. ఎన్నికలకు ముందు విద్య, ఆరోగ్యం, ఉపాధి లాంటి ప్రధాన అంశాల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Next Story