- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపే ఎన్నికలకు రెడీ.. లైవ్ డిబేట్ చేసే దమ్ముందా? మోడీకి దీదీ సవాల్
పొలిటికల్ మైలేజీ కోసం ‘ఆపరేషన్ సిందూర్’ను వాడుకోవడంపై ప్రధాని మోడీని మమతా బెనర్జీ విమర్శించారు. లైవ్ డిబేట్‌కు రావాలని సవాల్ విసిరారు.

దిశ, నేషనల్ బ్యూరో: తమ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన విమర్శలపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. తనతో లైవ్ డిబేట్‌కు రావాలని మోడీకి సవాల్ విసిరిన ఆమె.. ధైర్యం ఉంటే రాష్ట్రంలో త్వరగా ఎన్నికలు నిర్వహించాలని, రేప్పొద్దునే ఎన్నికలన్నా తమ పార్టీ సిద్ధమేనని ధీమా వ్యక్తం చేశారు. ‘నాతో లైవ్ డిబేట్‌లో కూర్చోవాలని సవాల్ విసురుతున్నా. కావాలంటే మీ టెలీప్రాంప్టర్ కూడా తెచ్చుకోవచ్చు’ అంటూ ఆమె వెటకారమాడారు. అలాగే ‘ఆపరేషన్ బెంగాల్’ ప్రారంభించాలని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. విపక్ష నేతలు అంతర్జాతీయంగా దేశం కోసం పాటుపడుతుంటే స్వదేశంలో కేంద్రం మాత్రం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
‘ప్రధాని మాటలు విని విస్తుపోయా. ఇది చాలా బాధాకరం. విపక్షాలన్నీ కలిసి అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. దేశం కోసం ధైర్యంగా ముందడుగేశాయి. ఇలాంటి సమయంలో ఆపరేషన్ సిందూర్ చేసినట్లు ఆపరేషన్ బెంగాల్ చేస్తామని ప్రధాని మోడీ, బీజేపీ నేతలు అనడం కరెక్టేనా?’ అని మమత ప్రశ్నించారు. అలాగే ‘ఆపరేషన్ సిందూర్’ను పొలిటికల్ మైలేజీ కోసం వాడుకోవడాన్ని కూడా ఆమె తప్పుపట్టారు. ‘మా ఎంపీ అభిషేక్ బెనర్జీ వెళ్లి అంతర్జాతీయంగా భారత్ కోసం మాట్లాడుతున్నారు. ప్రధాని మాత్రం విపక్షాల్ని, మా ప్రభుత్వాన్ని విమర్శించడంలో బిజీగా ఉన్నారు. వీళ్లంతా ఇక్కడ పొలిటికల్ హోలీ ఆడుతున్నారు’ అని మమత ఎత్తిపొడిచారు.
బెంగాల్‌లో అసలు చట్టమే లేదని, గూండాయిజమే రాజ్యమేలుతోందని మోడీ చేసిన వ్యాఖ్యలకు మమత గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘మధ్యప్రదేశ్‌లో జరిగింది చూసిన తర్వాత మీకు సిగ్గనిపించలేదా? రోడ్డు మీద బ్లూఫిల్మ్ ప్లే చేశారే’ అని ఆమె అన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఒక హైవేపై ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కెమెరాకు చిక్కిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే సదరు వ్యక్తి భార్య బీజేపీ నేత కావడం గమనార్హం.






