AYODHYA-TTD: అయోధ్య బాలరాముడికి తొలిసారిగా తిరుమల వెంకన్న పట్టువస్త్రాలు

by Y. Venkata Narasimha Reddy |

అయోధ్య బాలరాముడి(Ayodhya's Balaram) కి తిరుమల వెంకన్న (Tirumala Venkanna)తొలిసారిగా పట్టువస్త్రా(Silk Robes)లు సమర్పించనున్నారు.

AYODHYA-TTD: అయోధ్య బాలరాముడికి తొలిసారిగా తిరుమల వెంకన్న పట్టువస్త్రాలు
X

దిశ, వెబ్ డెస్క్ : అయోధ్య బాలరాముడి(Ayodhya's Balaram) కి తిరుమల వెంకన్న (Tirumala Venkanna)తొలిసారిగా పట్టువస్త్రా(Silk Robes)లు సమర్పించనున్నారు. టీటీడీ(TTD) చరిత్రలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి తరపున తొలిసారి అయోధ్య రాములవారికి పట్టువస్త్రాలను అందించేందుకు టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు(Chairman B.R. Naidu)ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. నిన్న రాత్రి అయోధ్యలో సరయూ నది ఒడ్డున జరిగే హారతి కార్యక్రమంలో బీఆర్ నాయుడు దంపతులు పాల్గొన్నారు.

ఈ రోజు టీటీడీ తరఫున అయోధ్య బాలరాముడికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన పుణ్యక్షేత్రాలకు పట్టువస్త్రాలను 2008 ఏడాది నుంచి టీటీడీ సమర్పిస్తోంది. గత నెలలో తమిళనాడులోని శ్రీరంగంలోని ప్రముఖ శ్రీ వైష్ణవ క్షేత్రం శ్రీ రంగనాథ స్వామికి టీటీడీ పట్టు వస్ర్తాలు అందించింది. సాధారణంగా శ్రీరంగం ఆలయ అధికారులు ప్రతి సంవత్సరం ఆణివార ఆస్థానం రోజున తిరుమల ఆలయానికి వస్త్రాలను సమర్పిస్తారు, అయితే ఈ పవిత్ర కార్తీక మాసం ఏకాదశి రోజున శ్రీ రంగం ఆలయానికి టీటీడీ పట్టు వస్త్రాలను అందచేసింది.

Next Story