చట్టసభల్లో సమయానికి చర్చలు తప్పనిసరి.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-01 06:14:28  IST  )

వికసిత్ భారత్ దిశగా దేశం ముందుడుగు వేస్తోందిన ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

చట్టసభల్లో సమయానికి చర్చలు తప్పనిసరి.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వికసిత్ భారత్ (Vikasith Bharath) దిశగా దేశం ముందుడుగు వేస్తోందిన ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ తొలి రోజుకు ఆయన లోకసభకు హాజరవుతూ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని అన్నారు. చట్టసభల్లో సమయానికి చర్చలు తప్పనిసరి అని తెలిపారు. దేశ ప్రగతి కోసం పార్లమెంటులో అధికార, విపక్ష సభ్యల సాక్షిగా మంచి చర్చలు కొనసాగాలని పేర్కాన్నారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యం దేశం ముందుడుగు వేస్తోందని కామెంట్ చేశారు.

దేశాభివృద్ధి కోసం విపక్షాలు కూడా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. బిహార్‌ (Bihar)లో రికార్డు ఓటింగ్ జరిగిందని తెలిపారు. ఆ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం పెరగడం సంతోషకరమని ప్రధాని అన్నారు. ఈ సారి పార్లమెంట్‌ సీజన్‌ కూడా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు బాటలు పరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కూడా తమ ఓటమిని పక్కనపెట్టాలని.. పార్లమెంట్‌లో డ్రామాలు చేయొద్దని అజెండాపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. మళ్లీ గెలవాలంటే ఎలా ప్రణాళికలు రూపొందించుకోవాలో కావాలంటే చిట్కాలు ఇస్తానంటూ విపక్షాలపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలనే సభలో లేవనెత్తాలని విజ్ఞప్తి చేశారు. తొలిసారి ఎంపీలుగా ఎన్నికైన వారికి సభలో మాట్లాడేందుకు అవకాశాలు ఇవ్వాలని ప్రధాని మోడీ అన్నారు.

Next Story