- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. కాంకేర్, గరియాబంద్ జిల్లాల సరిహద్దులోని రావాస్ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయని తెలిపారు. ఆదివారం ఉదయం భద్రతా సిబ్బంది మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ (Kanker Encounter) నిర్వహించేందుకు బయల్దేరారని, ఈ క్రమంలో కాల్పులు జరిగాయని వివరించారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని తెలిపారు. కాంకేర్, గరియాబంద్ నుంచి రాష్ట్ర పోలీస్ యూనిట్ అయిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG)కు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. కాగా.. ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






