- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ అసహ్యకరమైన రాజకీయాల కోసమేనా మీకు ఓట్లేశారు : స్టాలిన్ సంచలన ట్వీట్
తమిళనాడులో AIADMK ఎమ్మెల్యేల రాజీనామాలు విమర్శలకు దారితీశాయి. ఈ పరిణామంపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. అన్నడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ఆ లేఖలను స్పీకర్ కు పంపించారు. సత్యభామ, మరగాథం, జయకుమార్ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి.. ఉపఎన్నికల్లో టీవీకే నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవ్వడం.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారితీసింది. వీరంతా ఇటీవలే టీవీకేకు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. వీరి రాజీనామాలను గవర్నర్ ఆమోదిస్తే.. తిరుచ్చితోపాటు ఈ మూడు నియోజకవర్గాలకు కూడా ఉపఎన్నికలు అనివార్యం కానున్నాయి.
అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాలతో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సంచలన ట్వీట్ చేశారు. ఇలాంటి నీఛ రాజకీయాల కోసమేనా ప్రజలు మీకు ఓట్లేశారంటూ.. ఎక్స్ లో చేసిన పోస్టులో ఆరోపించారు. రాష్ట్రంలో గుర్రపు వేగంతో రాజకీయ రహస్య బేరసారాలు సాగుతున్నాయంటూ.. సీన్ 1, సీన్ 2, సీన్ 3 ఇలా జరిగాయని వివరించారు. మొదట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పూర్తిస్థాయిలో మెజారిటీ లేని పరిస్థితుల్లో డీఎంకే కూటమి పార్టీల నాయకులను మద్దతు కోరారని తెలిపారు. ఆ తర్వాత AIADMKలోని ఓ వర్గంతో తమకు సపోర్ట్ చేసేలా బేరసారాలు చేయడం, ఇప్పుడు కొంతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. ఏకంగా తమ పార్టీలోనే చేర్చుకునేందుకు ప్లాన్ చేయడం సిగ్గుచేటన్నారు. స్వచ్ఛమైన శక్తి అన్నవాళ్లే నేడు దుర్మార్గపు శక్తిగా మారారంటూ స్టాలిన్ విమర్శించారు. ఎన్డీయే (NDA) మద్దతు కోరకపోతేనే తాము మద్దతిస్తామని లేఖ ఇచ్చి.. ఇప్పుడు జరుగుతున్న ఈ డ్రామాలను మంత్రివర్గంలో కూర్చొని ఆస్వాదిస్తూ ఈలలు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా నవ్వులపాలవుతున్నారని, దీంతో వారి నిజస్వరూపమేంటో బట్టబయలైందని ఘాటుగా విమర్శించారు.






