- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీనాబ్ బ్రిడ్జి నిర్మాణంలో తెలుగమ్మాయి.. ‘రాక్ ఇంజినీర్’ మాధవీ లత కీలకపాత్ర!
చీనాబ్ బ్రిడ్జి నిర్మాణంలో తెలుగమ్మాయి. పర్వతాల అంచుల్లో బలమైన పునాదులు వేయడంలో ‘రాక్ ఇంజినీర్’ మాధవీ లత కీలకపాత్ర!

దిశ, నేషనల్ బ్యూరో: కశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే రైల్వే నెట్‌వర్క్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. వీటిలో చీనాబ్ బ్రిడ్జి చాలా కీలకం. ఈ బ్రిడ్జి వల్లనే రైల్వే కనెక్టివిటీలో ‘కశ్మీర్ టు కన్యాకుమారి’ కల సాకారమైంది. ఈఫిల్ టవర్ కన్నా ఎత్తయిన ఈ బ్రిడ్జిపై నడుస్తుంటే దేశ ఇంజనీర్ల నైపుణ్యాలు కళ్లకు కట్టినట్లు కనిపించాయని ప్రధాని మోడీ కూడా మెచ్చుకున్నారు. ఇలా ప్రధాని కొనియాడిన ఇంజనీర్ల బృందంలో మన తెలుగమ్మాయి మాధవీ లత కూడా ఉండట గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లోని యెడుగుండ్ల గ్రామానికి చెందిన మాధవి.. తన కమ్యూనిటీలో తొలి ఇంజనీరు. కాకినాడలోని జేఎన్‌టీయూలో బీటెక్ పూర్తిచేసిన ఆమె.. వరంగల్ ఎన్ఐటీ నుంచి ఎంటెక్ పట్టాపొందారు. ఆ తర్వాత ఐఐటీ మద్రాసులో పీహెచ్‌డీ పూర్తి చేసి, 2003 నుంచి బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
ఈ క్రమంలోనే నార్తర్న్ రైల్వేస్, ఆఫ్కాన్స్‌తో కలిసి చీనాబ్ బ్రిడ్జి నిర్మాణంలో భాగస్వామి అయ్యారు రాక్ ఇంజనీరు మాధవి. నేలను మరింత గట్టిగా చేసే మెకానిజంలపై ఆమె పరిశోధనలు చేశారు. అలాగే జియోసింథటిక్స్‌లో సూక్ష్మస్థాయి తేడాలను గుర్తించే ఇమేజ్ బేసిడ్ టెక్నిక్‌ల పరిశోధనలను ముందుండి నడిపించారు. స్లోప్ స్థిరత్వం, పునాది నిర్మాణం, డిజైనింగ్ విశ్లేషణల వల్లనే చీనాబ్ బ్రిడ్జి కల సాకారమైందని బెంగళూరు ఐఐఎస్‌సీ గర్వంగా ప్రకటించింది. సుమారు 17 ఏళ్లుగా ఆమె చేసిన పరిశోధనలు ఈ బ్రిడ్జి నిర్మాణంలో కీలకపాత్ర పోషించాయి. కఠినమైన హిమాలయ పర్వతాల్లో బ్రిడ్జిని చాలా జాగ్రత్తగా కట్టాల్సి ఉంటుంది. దీనికి పునాది చాలా ముఖ్యం. ఈ పునాదిని బలంగా వేయడంలో మాధవి కీలక పాత్ర పోషించారు. ఆమె కృషితో పూర్తయిన ఈ బ్రిడ్జి కనీసం మరో 120 ఏళ్లు అద్భుతంగా సేవలందిస్తుందని నిపుణులు చెప్తున్నారు.
చీనాబ్ బ్రిడ్జి విశేషాలు..
మొత్తం 1,315 మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జి.. 467 మీటర్ల వంపుతో ఆధునిక భారత ఇంజనీరింగ్ శక్తికి నిదర్శనంగా నిలిచింది. మొత్తం రూ.1,486 కోట్లతో నిర్మించిన ఈ బ్రిడ్జిని గంటలకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా నిర్మించడం గమనార్హం.
We are proud of Prof Madhavi Latha & her team's contribution to the #ChenabBridge inaugurated by Hon'ble PM Narendra Modi🎉The team worked on stability of slopes, design & construction of foundations, design of slope stabilisation systems incl. rock anchors to withstand hazards. pic.twitter.com/BApCSJTRZX— IISc Bangalore (@iiscbangalore) June 6, 2025






