- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్సీపీ విలీనానికి మూహుర్తం కూడా ఫిక్స్.. సునేత్ర ప్రమాణ స్వీకారం వేళ శరద్ పవార్ కామెంట్స్
అజిత్ పవార్ రాజకీయ వారసత్వంపై క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలో NCP రెండు వర్గాల విలీనంపై శరత్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) అకాల మరణంతో ఆయన భార్యకు సునేత్ర పవార్ (Sunetra Pawar) ఆయన పోస్టు కేటాయిస్తున్నారన్న ప్రచారంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారంపై సమాచారం లేదన్నారు. ఆ పదవి తీసుకుంటున్నట్టు కూడా సునేత్ర తనకు చెప్పలేదన్నారు. ఎన్సీపీ రెండు వర్గాలు విలీనం కావాలని అజిత్ పవార్ కోరుకున్నారని చెప్పారు. రెండు వర్గాల విలీనంపై ఈ నెల 17న చర్చలు జరిగాయని, ఫిబ్రవరి 12న రెండు వర్గాలు కలిసిపోవాలని అజిత్ కోరుకున్నారని శరద్ పవార్ వెల్లడించారు. దురదృష్టవశాత్తూ విమాన ప్రమాదంలో అజిత్ చనిపోవడంతో ఆ చర్చలు ఆగిపోయాయని వివరించారు.
సందిగ్ధంలో ఎన్సీపీ శ్రేణులు:
రెండు ఎన్సీపీ (NCP) వర్గాలు తిరిగి విలీనం అయ్యేందుకు అజిత్ పవార్ ఆసక్తితో ఉన్నారని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాశంగా మారాయి. ఈ విషయంలో ఇప్పటికే చర్చలు జరుగగా ఫిబ్రవరి 12న రెండు వర్గాలు కలిసిపోవాలని అజిత్ కోరుకున్నారంటూ మూహుర్తం కూడా ప్రకటించడం వెనుక మతలబు ఏంటి అనేది ఆసక్తిగా మారింది. అజిత్ మరణానికి ముందు నుంచి విలీనంపై ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ విమాన ప్రమాదంలో ఆయన మరణించడం, ఆ వెంటనే సునేత్ర ఉప ముఖ్యమంత్రి పదవి అలంకరించబోతుండటంతో విలీనం విషయం ముందుకు పడుతుందా? సునేత్ర ప్రమాణ స్వీకారానికి ముందే విలీనానంపై శరద్ పవార్ వ్యాఖ్యలు చేయడం ఏంటి? అనేది చర్చనీయాశంగా మారింది.






