ఆర్ఎస్ఎస్‌లో కుల, మత విభజన ఉండదు: మోహన్ భగవత్

by Malleboina Mahesh |

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో ఎటువంటి కుల, మత విభజన ఉండదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పుకొచ్చారు.

ఆర్ఎస్ఎస్‌లో కుల, మత విభజన ఉండదు: మోహన్ భగవత్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో ఎటువంటి కుల, మత విభజన ఉండదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (RSS chief Mohan Bhagwat) చెప్పుకొచ్చారు. “100 ఇయర్స్ ఆఫ్ సంగ్ జర్నీ: న్యూ హరైజన్స్” అనే రెండు రోజుల ఉపన్యాసం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. భరతమాత పుత్రులం అని భావించే ప్రతి ఒక్కరినీ సంఘం స్వాగతిస్తుంది” అని మోహన్ భగవత్ స్పష్టంచేశారు. “సంఘంలో బ్రాహ్మణులు, ఇతర కులాలు, ముస్లింలు, క్రైస్తవులు వేర్వేరు కేటగిరీలుగా పరిగణించబడరని తాము ఎవరి కులం, మతం అడగమని సంఘంలో హిందూ సమాజం అనే విస్తృత భావనతో ఉంటారని చెప్పుకొచ్చారు. అలాగే అనేక సందర్భాల్లో “ముస్లింలు, క్రైస్తవులు కూడా శాఖా కార్యక్రమాలకు వస్తారని.

అలాగే సాధారణ హిందూ సమాజంలోని అన్ని వర్గాలు కూడా శాఖలో పాల్గొంటారని, చెప్పుకొచ్చారు. శాఖ, సంఘం కార్యక్రమాలకు వచ్చే వారిని తాము ఏ మతానికి చెందిన వారు అనే లెక్క వేసుకోమని, మనమంతా భారతమాత సంతానం విధంగా ముందుకు సాగుతామని.. అదే ఆర్ఎస్ఎస్ ధోరణి” అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా భగవత్‌ హిందుత్వాన్ని ఒక జాతీయ ఐక్యత భావనగా నిర్వచించారు. భిన్న మతాలు, సంప్రదాయాలు కలిసినప్పుడే నిజమైన భారత్‌ సమగ్రత బలపడుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

Next Story