ఇరు దేశాలు కూర్చొని మాట్లాడుకోవాలి.. దాడులపై సీపీఐ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |

భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తతలపై సీపీఐ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు డి. రాజా (CPI MP D.Raja) స్పందించారు.

ఇరు దేశాలు కూర్చొని మాట్లాడుకోవాలి.. దాడులపై సీపీఐ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తతలపై సీపీఐ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు డి. రాజా (CPI MP D.Raja) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి (Peace) కోసం రెండు దేశాలు పోరాటాన్ని ఆపి, కూర్చొని మాట్లాడుకోవాలని ఆయన సూచించారు. ఇండియా (India), పాకిస్థాన్ (Pakistan) ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం వల్ల సరిహద్దు ప్రాంతాలలోని ప్రజలలో భయం ఉందని తెలిపారు. రాత్రిపూట ప్రజలు భయంతో జీవించాల్సి వస్తుందని, ముందుగా వారిని రక్షించడానికి ఏదైనా చేయాలని చెప్పారు.

ఇక మాకు యుద్ధం (War) అంటే వినాశనం, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, ప్రజల బాధలు పెరగడం ఇవే గుర్తుకువస్తాయని అన్నారు. అందుకే మా పార్టీ యుద్ధం పరిష్కారం కాదని, ఎటువంటి శాశ్వత పరిష్కారాన్ని అందించలేదని స్పష్టంగా చెబుతోందని వెల్లడించారు. ఇక మనం శాంతి కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉందని, దీని కోసం రెండు దేశాలు దాడులను ఆపి, రాజకీయ సంభాషణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం భారతదేశానికి మాత్రమే కాదు.. పాకిస్తాన్‌కు కూడా సమస్య అని, ఇది ఒక సాధారణ ముప్పు అని తెలిపారు. ఈ ఉగ్రవాదాన్ని ఎలా సాధారణంగా ఎదుర్కోవాలో రెండు దేశాలు ఆలోచించాలి అని సీపీఐ ఎంపీ సూచించారు.

కాగా భారత్ -పాక్ దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాజకీయ నాయకులు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే సీపీఐ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత సీపీఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆయన అలా స్పందించి ఉండకపోయి ఉంటే గౌరవంగా ఉండేదని నారాయణ అభిప్రాయం పట్ల కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో సీపీఐ నేత దాడులను ఆపాలని చెప్పడం, రెండు దేశాలు రాజకీయంగా కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

Next Story