- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే
యూజీసీ కొత్త నిబంధనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న వేళ ఈ నిబంధనలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) జారీ చేసిన కొత్త నిబంధనలపై దేశవ్యాప్తంగా వివాదం రేగిన వేళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. యూజీసీ (UGC Regulations 2026) తీసుకువచ్చిన 2026 కొత్త నిబంధనలపై గురువారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మార్గదర్శకాలు అస్పష్టంగా ఉన్నాయని వీటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేంద్రం, యూజీసీకి ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ 2012 నిబంధనలే కొనసాగించాలని ఆదేశించింది. కులవివక్ష లేని సమాజం కోసం మనం ఏం సాధించాం ఈ విషయంలో మనం మళ్లీ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా అని ప్రశ్నించింది.
ఏమిటీ వివాదం?:
ప్రతి ఉన్నత విద్యా సంస్థలోనూ సమానత్వ (ఈక్విటీ) కమిటీల ఏర్పాటును యూజీసీ ఇటీవల తప్పని సరి చేస్తూ ప్రస్తుతం ఉన్న 2012 నిబంధనల స్థానంలో కొత్త నిబంధనలను ఈ నెల 13న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రెగ్యులేషన్స్ 2026 పేరుతో విడుదల చేసింది. అయితే సమానత్వ కమిటీల్లో ఓబీసీలు, వికలాంగులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళలు ప్రతినిధులుగా ఉంటారు. ఈ సెల్ కోర్టులాగా పనిచేస్తుంది. విద్యార్థుల్లో ఎవరైనా తమకు వివక్ష ఎదురైందని భావిస్తే వారు ఈక్విటీ సెల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఈ కమిటీలో జనరల్ కేటగిరీకి చెందిన సభ్యులు ఎవరూ లేరు. కమిటీలో జనరల్ కేటగిరీ ప్రాతినిధ్యం గురించి ప్రస్తావించలేదు.






