65 మంది మహిళలకు షాకిచ్చిన వ్యక్తి.. వాడిపడేసిన కండోమ్స్ పార్సిళ్లు

by Disha Web Desk 6 |
Condoms
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది అమ్మాయిలు ఏదో విధంగా వేధింపులకు గురవుతున్నారు. బయటకు వస్తే చాలు కొంత మంది కామాంధులు వారిపై దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఆస్ట్రేలియాలో ఓ షాకింగ్ ఘటన కలకలం సృష్టిస్తోంది. ఓ వ్యక్తి ఏకంగా 65 మంది మహిళలకు వీడిపడేసిన కండోమ్స్‌ను పార్సిల్ చేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి వాడి పడేసిన కండోమ్‌లను 65 మంది మహిళలకు పార్సిల్ చేశాడు. కొంత మందికి చేతితో రాసిన లెటర్స్‌ను కూడా పంపాడు. అవి చూసిన మహిళలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి విస్తుపోయే విషయాలను కనుగొన్నారు. 65 మంది మహిళలు 1999లో ఒకే కాలేజీలో చదువుకున్నారని గుర్తించారు. వీరి అడ్రస్‌లను అక్కడి నుంచే నిందితుడు సేకరించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ విషయం గురించి తెలుసుకున్న వారు హీరో అంటూ పొగిడేస్తున్నారు. మరికొంత మంది తిట్టిపోస్తున్నారు.

Next Story