- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: దేశంలో ముగిసిన లోక్ సభ ఎన్నికల సమరం.. మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల
దేశంలో లోక్ సభ ఎన్నికల సమరం ముగిసింది. ఈ సారి మొత్తం ఏడు దశల్లో దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు జరగగా.. చివరి దశ ఇవాళ

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో లోక్ సభ ఎన్నికల సమరం ముగిసింది. ఈ సారి మొత్తం ఏడు దశల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగగా.. చివరి దశ ఇవాళ ముగిసింది. 7వ దశలో భాగంగా 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో యూపీ 13, పంజాబ్ 13, బెంగాల్‌లో 9, బిహార్ 8, హిమాచల్ ప్రదేశ్ 4, ఝార్ఖండ్ 3, ఒడిశా 6, చండీగఢ్‌లో ఒక లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఏడో విడతలో మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. మొత్తం 904 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈసీ రూల్స్ ప్రకారం ప్రస్తుతం పోలింగ్ బూత్‌లలో క్యూలో ఉన్నవారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక, ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, రిజల్ట్స్ కంటే ముందే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసే ఎగ్జిట్ పోల్స్‌పై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్న నేపథ్యంలో మెజార్టీ సర్వే సంస్థలు ఏ పార్టీకి పట్టం కట్టాయో మరి కొన్ని నిమిషాల్లో తేలనుంది.






