ఇద్దరమ్మాయిల ప్రేమ.. ఎంగేజ్‌మెంట్ రోజే రచ్చ చేసిన అమ్మాయి.. ఎందుకంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-06 12:30:51  IST  )

రాష్ట్రంలో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇద్దరమ్మాయిల ప్రేమ.. ఎంగేజ్‌మెంట్ రోజే రచ్చ చేసిన అమ్మాయి.. ఎందుకంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం అందరికి తెలిసిందే. అయితే.. ప్రేమ అనేది ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో చెప్పడం కష్టమే. చాలా మంది ప్రేమకు వయసుతో సంబంధం లేదని చెబుతుంటారు. అలాగే ప్రేమ ఎవరి మధ్య అయినా పుడుతుంది. ఈ క్రమంలో ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో పడటం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో ఇద్దరి అమ్మాయిల మధ్య ప్రేమను చూపించే చిత్రాలు కూడా వచ్చాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని బులంద్‌షహర్‌(BulandhShahar)లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ హోటల్‌(Hotel)లో ఓ అమ్మాయి నిశ్చితార్థం జరుగుతోంది. ఈ క్రమంలో కరెక్ట్ సమయానికి ఆ వేడుక వద్దకు ఓ అమ్మాయి ఆవేశంతో వచ్చింది. ఈ క్రమంలో ఆమె కారణంగా ఎంగేజ్‌మెంట్ ఆగిపోయింది. అయితే ఈ కార్యక్రమం ఆగిపోవడానికి వరుడితో ఆమెకు సంబంధం ఉందని కాదు. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది.

అది ఏంటంటే.. వధువుతో తాను నాలుగేళ్లుగా సహజీవనం(coexistence) చేస్తున్నట్లు ఆ అమ్మాయి పేర్కొంది. ఈ క్రమంలో ఇద్దరమ్మాయిలు నిశ్చితార్థం(Engagement) వేదిక పై గొడవకు దిగారు. ఈ క్రమంలో వధువును తీసుకెళ్లేందుకు ఆ అమ్మాయి ప్రయత్నించింది. కానీ అక్కడ ఉన్నవారు అడ్డుకుని దాడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరలవుతోంది. అయితే స్వలింగ సంపర్క సంబంధం కారణంగా వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇద్దరమ్మాయిల ప్రేమ కథ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Next Story