- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
West Bengal: రక్షించాల్సిన పోలీసులే కుట్రదారులుగా మారారు: పశ్చిమ బెంగాల్ గవర్నర్
వైద్యులు, వైద్య విద్యార్థులు నిరసన తెలుపుతున్న క్యాంపస్ ద్వంసమైన ప్రదేశాన్ని గవర్నర్ సందర్శించారు.

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ కోల్‌కతా పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల్లోని ఒక వర్గం రాజకీయ రంగు పులుముకుందని, నేరపూరితమైందని ఆరోపణలు చేశారు. ఇటీవల ఓ ట్రైనీ మహిళా వైద్యురాలి సాముహిక అత్యాచారం, హత్య ఘటనపై ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ వైద్యులు, వైద్య విద్యార్థులు నిరసన తెలుపుతున్న క్యాంపస్‌లో ద్వంసమైన ప్రదేశాన్ని గవర్నర్ సందర్శించారు. 'తాను చూసింది, విన్నది దిగ్భ్రాంతికరంగా ఉంది. ఈ ఘటన బెంగాల్‌తో పాటు మానవత్వానికే సిగ్గుచేటు. మన చుట్టూ నెలకొన్న హీనస్థితికి ఇది నిదర్శనం ' అని ఆనంద బోస్ విచారం వ్యక్తం చేశారు. 'చట్టాన్ని రక్షించాల్సినవారే కుట్రదారులుగా మారారు. పోలీసుల్లో ఒక వర్గం రాజకీయ, నేరపూరితంగా మారిపోయింది. ఈ తెగులును అంతం చేయాలి. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాత్రిపూటైనా సరే పనికి వెళ్తే క్షేమంగా ఉండాలి, రక్తపాతం కాకూడదని అన్నారు. దీనికి ముందు విద్యార్థులతో మాట్లాడిన గవర్నర్.. మీకు న్యాయం జరుగుతుంది. స్వయంగా మీ మాటలు వినేందుకు వచ్చాను. ఈ ఘటనపై పోరాడుదాం, గెలుస్తామని అన్నారు. ఇకమీదట రాష్ట్రంలో మహిళలపై ఇలాంటి ఘోరమైన దాడులు జరిగేందుకు అనుమతించబోం. మీకు అండగా ఉంటామని, కేసు త్వరితగతిన ముందుకెళ్లేందుకు అవసరమిన చర్యలు తీసుకుంటానని గవర్నర్ భరోసా ఇచ్చారు.






