- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రస్తుతం 1971 నాటి పరిస్థితులు లేవు.. మనకు శాంతి అవసరం: కాంగ్రెస్ ఎంపీ
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తలకు శనివారం సాయంత్రం బ్రేక్ పడింది. అమెరికా జోక్యంతో భారత్, పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తలకు శనివారం సాయంత్రం బ్రేక్ పడింది. అమెరికా జోక్యంతో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందం జరిగింది. దీంతో సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితులు చక్క బడుతున్నాయి. అయితే భారత్ పాకిస్తాన్‌పై వార్ నిలిపివేయడంతో పలువురు భిన్నవాదనలను వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాల్పుల విరమణ పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Congress MP Shashi Tharoor) స్పందించారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య కుదిరిన అవగాహనపై ఆయన మాట్లాడుతూ.. "మనకు శాంతి అవసరం. ప్రస్తుతం దేశంలో 1971 నాటి పరిస్థితులు లేవు. ఇప్పుడు చాలా తేడాలు ఉన్నాయి. ఇది దేశం కొనసాగించాలనుకున్న యుద్ధం కాదు. భారత్ ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలనుకుంది. దీంతో వారికి తగిన గుణపాఠం నేర్పించింది. పహల్గామ్ భయానక సంఘటనలు చేసిన నిర్దిష్ట వ్యక్తులను గుర్తించి ట్రాక్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంటుందని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను" అని రాసుకొచ్చారు.






