- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాలే బంగారమాయేనా.. వంతార వెనుక వ్యాపార రహస్యం?
వంతార.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేటు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. గుజారాత్ లోని జామ్ నగర్ వద్ద దీనిని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారానికి కూతవేటు దూరంలోనే 3వేల ఎకరాలలో దీనిని ఏర్పాటు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: వంతార.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేటు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. గుజారాత్ లోని జామ్ నగర్ వద్ద దీనిని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారానికి కూతవేటు దూరంలోనే 3వేల ఎకరాలలో దీనిని ఏర్పాటు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ దీని బాధ్యతలు చూసుకుంటున్నారు. దేశ ప్రధాని మోడీ స్వయంగా వంతారాను ఈ ఏడాది మార్చిలో ప్రారంభించారు. వంతారా జంతువులకు స్వర్గదామం అని, అంబానీ కరుణామయుడని కీర్తించారు. కానీ అంత సీన్ లేదని అంబానీ జంతువులపై ప్రేమతోనో.. ప్రకృతిని కాపాడేందుకో ఈ ప్రాజెక్టును చేపట్టడంలేదని తెలుస్తోంది. వంతార వెనుక అంబానీ వ్యాపార రసహ్యం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆ ప్రచారం ఆధారంగా.. వేల ఎకరాల్లో చెట్లను పెంచి గాలిని అమ్ముకునేందుకే అంబానీ వంతారాను నిర్మిస్తున్నాడు. చెట్లు ఆక్సీజన్ ఇచ్చి కార్బన్ డై ఆక్సైడ్ లేదా కార్బన్ ఉద్గారాలను గ్రహిస్తాయి.
కార్బన్ డై ఆక్సైడ్ సంగ్రహించే శక్తి చెట్టును బట్టి మారుతుంది. గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ ను తగ్గించే సామర్థ్యం ఆధారంగా కార్బన్ క్రెడిట్స్ సమకూరుతాయి. ఆ కార్బన్ క్రెడిట్స్ తోనే ఇప్పుడు అంబానీ వ్యాపారం చేయబోతున్నాడు. ఇది వరకు ఒక కంపెనీ నిర్ణీత పరిమితి కంటే అధికంగా కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తే కాలుష్య నియంత్రణ మండలి నిబంధన ప్రకారం జరిమానా విధిస్తారు. కానీ కొత్త చట్టం ప్రకారం సదరు కంపెనీ కార్బన్ క్రెడిట్స్ జమచేస్తే సరిపోతుంది. కాబట్టి అంబానీ ఇప్పుడు కార్బన్ క్రెడిట్స్ తోనే వ్యాపారం చేయబోతున్నాడు. అందుకోసం వంతారాలో కార్బన్ డై ఆక్సైడ్ అధికంగా గ్రహించే మామిడి చెట్లనే 600 ఎకరాల్లో నాటాడు. మొత్తం 1.30 లక్షల మామిడి చెట్లు నాటగా ప్రతి చెట్టు 50 ఏళ్లలో 20 టన్నుల కార్బన్‌ను తగ్గిస్తుందని అంచనా. వంతారాలో మొత్తం 4 లక్షల మొక్కలు ఉండగా అవి దాదాపు 80 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను పీల్చుకుంటాయి. దీంతో ఒక టన్నుకు ఒక కార్బన్ క్రెడిట్ జమ అవుతుంది. అలా వచ్చిన కార్బన్ క్రెడిట్ ను అంబానీ కంపెనీలకు అమ్ముకోవచ్చు.
2040 నాటికి దేశంలో కాలుష్యం పెరిగి నాణ్యమైన గాలి బంగారం, క్రిప్టో కరెన్సీ కంటే ఖరీదైనదిగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏనుగులు, సింహాల రక్షణ పేరుతో అంబానీ కార్బన్ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు 2040 నాటికి నీళ్లు కూడా బంగారమయ్యే అవకాశం ఉంది. వంతారాలో చెట్లతో పాటు నీటి సరస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. అక్కడ స్వచ్చమైన నీరు దొరుకుతుంది. ఇప్పటికే అంబానీ మినరల్ వాటర్ వ్యాపారంలో ఉన్నాడు. కాబట్టి ఆ నీటిని కూడా వ్యాపారంగా మార్చుకోవచ్చు. నీళ్లు, గాలి మాత్రమే కాకుండా జంతువుల సంరక్షణ వెనుక ఓ వ్యాపారం దాగుంది. ప్రతి జీవి జెనటిక్స్ వేరుగా ఉంటాయి. భవిష్యత్‌లో వైద్య రంగంలో ప్రయోగాలు చేయాలంటే జీవులు అవసరం. వంతారాలో 32 దేశాలకు చెందిన 39వేల జంతువులు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా చూసినా అంబానీకి కాసుల వర్షమే. ఏదైతే సులభంగా దొరకదో.. ఏదైతే కొరత ఉందో దాన్నే వ్యాపారంగా మార్చుకుంటే సక్సెస్ అవ్వొచ్చు. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో పచ్చని అడవులను నరికేస్తూ కంపెనీలు, టూరిజం పేరుతో రోడ్లు, భవనాలు నిర్మిస్తున్నారు. పరిశ్రమల వల్ల కలుషితమయ్యేది వాతావరణమే. కాబట్టి ప్రపంచం పరిశుభ్రమైన గాలి, స్వచ్చమైన నీటి కోసం ఎంత ఖర్చు చేయడానికైనా సిద్దమైనప్పుడు అంబానీ వాటిని అందించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడు.






