థాంక్యూ మహారాష్ట్ర! కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోడీ రియాక్షన్ ఇదే

by Ramesh Naini |

మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు.

థాంక్యూ మహారాష్ట్ర! కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోడీ రియాక్షన్ ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో : మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘థాంక్యూ మహారాష్ట్ర! ప్రజల పక్షపాత మంచి పాలన అనే ఎన్డీఏ అజెండాకు రాష్ట్ర ప్రజలు ఆశీర్వాదం అందించారు. వివిధ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర ప్రజలతో ఎన్డీఏ బంధం మరింత బలపడినట్లు స్పష్టం చేస్తున్నాయి. మా పాలనలోని ట్రాక్ రికార్డు, అభివృద్ధి దృష్టికోణం ప్రజలను ఆకట్టుకున్నాయి. మహారాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది ప్రగతికి మరింత ఊపునిచ్చే తీర్పు’ అని ప్రధాని పేర్కొన్నారు.

అలాగే, ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ఎన్డీఏ కార్యకర్తలను ప్రధాని మోడీ ప్రత్యేకంగా అభినందించారు. ‘మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మధ్య నిరంతరం శ్రమించిన ప్రతి ఎన్డీఏ కార్యకర్తపై నాకు ఎంతో గర్వంగా ఉంది. వారు మా కూటమి సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు, భవిష్యత్తు అభివృద్ధి దృష్టిని స్పష్టంగా వెల్లడించారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారు. వారికి నా శుభాకాంక్షలు” అని ప్రధాని తెలిపారు.

Next Story