- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లష్కరే నేతలకు లైవ్‌లో ఉగ్రదాడి!.. - బాడీకామ్ ధరించిన టెర్రరిస్టులు
పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్టులు బాడీకామ్ ధరించారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: పహల్గాం ఉగ్ర ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. నలుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరి షర్టులకు బాడీకామ్ ఉన్నాయని బాధితులు చెప్తున్నారు. ఉగ్రదాడిని లైవ్ లో లష్కర్ ఎ తాయిబా ముఖ్యులు చూసేందుకే బాడీకామ్ పెట్టుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చిన టెర్రరిస్టులు పూర్తిగా పాక్ చెందిన వారేనని.. అందువల్లనే స్థానికుల మాటతీరును గుర్తుపట్టక, ఐడీలు అడిగి మరీ చంపారని నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 28మంది చనిపోగా.. మరో 20మంది వరకు గాయపడినట్టు తెలుస్తున్నది. మరోవైపు స్థానికులు సైతం ఉగ్రదాడిని ఖండిస్తూ.. కశ్మీర్ బంద్ కు పిలుపునిచ్చారు. పర్యాటకరంగాన్ని దెబ్బకొడితే.. తమ జీవనోపాధి పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తగులబెట్టిన పాక్ జెండాలు
తమ పొట్టకొడుతున్న పాక్ తీరుపై కశ్మీరీలు మండిపడుతున్నారు. ఏడాదిలో 8 పర్యాటకం జోరుగా సాగుతుందని.. మిగితా 4 నెలలు తమకు సరైన ఉపాధి కూడా ఉండదని వాపోతున్నారు. ఉగ్రవాదుల చర్యలతో పర్యాటకంపై దెబ్బపడితే తమకు తినడానికి కూడా తిండి ఉండదని ఆందోళన చెందుతున్నారు. పాక్ పై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఎలాంటి చర్యలు తీసుకున్నా.. తాము మద్దతు ఇస్తామని లాల్ చౌక్ వేదికగా నినాదాలు చేశారు.
కశ్మీర్ బంద్
ఉగ్రదాడిని నిరసిస్తూ కశ్మీర్ లోయలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పాక్ తీరును అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండించారు. గతంలో వరదలు వచ్చినప్పుడు యాత్రికులను తమ ఇళ్లకు తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చామని.. పర్యాటకుల ద్వారానే తమకు ఉపాధి లభిస్తుందని, వారిని చంపడం అత్యంత హీనమైన చర్యగా వారు అభివర్ణిస్తున్నారు. ఇది కశ్మీరియత్ (సంస్కృతి)కి విరుద్ధమని మండిపడుతున్నారు.






