- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తత.. జోర్డాన్ రాజుకు ప్రధాని మోదీ ఫోన్
గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడి, అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై చర్చించారు.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ ఆసియా (Western Asia) ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా జోర్డాన్ (Jordan)తో పాటు పొరుగు దేశాల్లో నెలకొన్న అస్థిరతపై మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భద్రత అంశంపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. జోర్డాన్, ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయ సమాజం క్షేమంగా ఉండేలా చూడాలని ప్రధాని ఆయనను కోరారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయులకు జోర్డాన్ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా జోర్డాన్‌లో శాంతి, సుస్థిరతలను కాపాడటంలో భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. ప్రాంతీయ భద్రత విషయంలో జోర్డాన్ తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన తాజా పరిణామాల వల్ల గగనతలం మూసివేత, విమానాల రద్దు వంటి అంశాలు చర్చకు వచ్చాయి. యుద్ధ వాతావరణం వీడి, శాంతి పునరుద్ధరణ జరగాలని ఇరువురు నేతలు ఆకాంక్షించారు.
కాగా, గత కొద్ది రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు ప్రతిదాడులు జరుగుతుండటంతో జోర్డాన్ తన గగనతలాన్ని పాక్షికంగా మూసివేసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వేలాది మంది భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోంది.






