విమానంలో సాంకేతిక లోపం.. ఐదుగురు MPలకు తప్పిన పెను ముప్పు

by Kema Shiva Kumar |

ఎయిరిండియా ఫ్లైట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంలో కాంగ్రెస్ అగ్ర నేతలకు ముప్పు తప్పింది.

విమానంలో సాంకేతిక లోపం.. ఐదుగురు MPలకు తప్పిన పెను ముప్పు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎయిరిండియా ఫ్లైట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంలో కాంగ్రెస్ అగ్ర నేతలకు ముప్పు తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి తిరువనంతరపురం నుంచి ఎయిరిండియా విమానం AI 2455 ఢిల్లీకి బయలుదేరింది. అయితే, మార్గమధ్యలో ఉన్నట్టుండి రాడార్ వ్యవస్థలో టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పెలైట్లు విమానాన్ని చెన్నై ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్స్ ల్యాండింగ్ చేశారు. కాగా, అదే ఫ్లైట్‌లో కేరళకు చెందిన నలుగురు ఎంపీలు ఉన్నారు. వారిలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, యూడీఎఫ్ కన్వీనర్ ఆడూర్ ప్రకాష్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొడికున్నిల్ సురేష్, కె.రాధాకృష్ణన్‌తో పాటు తమిళనాడు ఎంపీ రాబర్ట్ బ్రూస్ కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా జరిగిన ఘటనపై కేసీ వేణుగోపాల్ ‘X’ వేదికగా స్పందించారు. అదృష్టం కొద్దీ విమానం ప్రమాదం నుంచి తప్పించుకున్నామని అన్నారు. తిరువనంతపురం నుంచి దిల్లీకి వెళ్తున్న ఎయిరిఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని పేర్కొన్నారు. టేకాఫ్‌ అయిన వెంటనే విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించి చెన్నైకి మళ్లించి అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారని తెలిపారు. పైలట్‌ తక్షణ నిర్ణయం ప్రయాణికుల ప్రాణాలను కాపాడిందని అన్నారు. భయంకర విషాదాన్ని తాము తృటిలో తప్పించుకున్నట్లు కేసీ వేణగోపాల్ తెలిపారు. అయితే, ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం, ల్యాండింగ్ రద్దు కావడానికి దారితీసిన సంఘటనలపై డీజీసీఏ (DGCA) విచారణ చేపట్టనుంది.

Next Story