- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. ఢిల్లీకి తిరిగి వచ్చిన ఫ్లైట్
by Kema Shiva Kumar |
విమానాల్లో సాంకేతిక లోపాలు సర్వసాధారణమైపోయాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: విమానాల్లో సాంకేతిక లోపాలు సర్వసాధారణమైపోయాయి. దీంతో ప్రయాణికులు ఫ్లైట్ జర్నీ చేయాలంటూనే జంకుతున్నారు. ఈ క్రమంలోనే ఇండిగో (Indigo) విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తిన ఘటన ఢిల్లీ (Delhi) నంచి లెహ్ (Leh)కు వెళ్తుండగా చోటుచేసుకుంది. ఇండిగో ఎయిర్‌బస్ A320-251N, ఫ్లైట్ నెంబర్: 6E 2006 ఇవాళ ఉదయం 6.30కి ఢిల్లీ నుంచి లేహ్‌కు బయలుదేరింది. అయితే, లేహ్‌కు సమీపంలో ల్యాండింగ్ వేళ ఫ్లైట్‌లో ఉన్నట్టుండి సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పెలైట్లు తిరిగి ఫ్లైట్‌ను తిరిగి ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు (Indira Gandhi International Airport)లో ల్యాండ్ చేశారు. అయితే, ఎయిర్‌లైన్ విధివిధానాలను అనుసరించి ప్రయాణికుల కోసం ఇండిగో యాజమాన్యం ఆల్టర్‌నేట్ ఫ్లైట్‌ను ఏర్పాటు చేసి లేహ్‌కు పంపనున్నట్లుగా పేర్కొంది.
Next Story






