- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంప్యూటర్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం.. ఆలస్యంగా నడుస్తోన్న 827 విమానాలు
సాంకేతిక లోపం కారణంగా ఎక్కడికక్కడ విమానాలు నిలిచిన ఘటన ఇవాళ ఉదయం అమెరికా (America) వ్యాప్తంగా చోటుచేసేకుంది.

దిశ, వెబ్‌డెస్క్: సాంకేతిక లోపం కారణంగా ఎక్కడికక్కడ విమానాలు నిలిచిన ఘటన ఇవాళ ఉదయం అమెరికా (America) వ్యాప్తంగా చోటుచేసేకుంది. వివరాల్లోకి వెళితే.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ (United Airlines) కంప్యూటర్ సిస్టమ్‌లో టెక్నికల్ సమస్య తెలత్తింది. ఈ పరిణామంతో సుమారు 827 విమానాలు షెడ్యూల్ టైమ్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక 23 విమానాలు పూర్తిగా రద్దు అయ్యాయి. అయితే, టెక్నికల్ సమస్య సైబర్ దాడి (Cyber Attack) మాత్రం కాదని ఎయిర్‌లైన్ ధృవీకరించింది.. తిరిగి సిస్టమ్స్‌ను పునరుద్ధరించేందుకు టెన్నికల్ టీమ్ వర్క్ చేస్తోందని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ అధికారులు పేర్కొన్నారు. యునైటెడ్ ఎక్స్‌ప్రెస్ (United Express) విమానాలపై ఈ ప్రభావం ఉండదని.. అవి యథావిధిగా నడుస్తున్నాయని తెలిపారు. నెవార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో, డెన్వర్, హ్యూస్టన్ వంటి ప్రధాన హబ్‌లలో గ్రౌండ్ స్టాప్‌కు ఎయిర్‌లైన్ టెక్నికల్ సమస్యపై సమాచారం అందజేశారు.






