M-17 ఆర్మీ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-14 16:03:54  IST  )

వరుస గగనతల ప్రమాదాలు, బాంబు బెదిరింపు కాల్స్ దేశ ప్రజలకు కలవర పెడుతున్నాయి.

M-17 ఆర్మీ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస గగనతల ప్రమాదాలు, బాంబు బెదిరింపు కాల్స్ దేశ ప్రజలకు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గురువారం అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. తాజాగా, థాయ్‌లాండ్‌లో ఓ ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో అప్రమత్తమైన ఫ్లైట్ సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ రాష్ట్రంలో నంగాల్‌పూర్ వద్ద మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సిబ్బందితో ప్రయాణిస్తున్న M-17 ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్‌లో ఉన్నట్టుండి టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో హెలికాప్టర్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Click For Instagram post..

Next Story