- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral: బీహార్‌లో సిగ్గుమాలిన ఘటన.. విద్యార్థినితో మసాజ్ చేయించుకున్న గురువు.. వైరల్
బీహార్‌లో ఓ సిగ్గుమాలిన వెలుగు చూసింది. తరగతి గదిలో విద్యార్థినితో మసాజ్ చేయించుకున్నాడు ఓ గురువు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Bihar) బీహార్‌లో ఓ సిగ్గుమాలిన వెలుగు చూసింది. తరగతి గదిలో విద్యార్థినితో మసాజ్ చేయించుకున్నాడు ఓ గురువు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఆయన చెప్పే సమాధానానికి అందరూ షాక్ అయ్యారు. ముంగేర్ జిల్లాలోని (Government school) ఓ ప్రభుత్వ పాఠశాలలో సుమన్ కుమార్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థినితో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన కాళ్లను అతడు బెంచీపై ఉంచగా, విద్యార్థిని మసాజ్ చేయడం వీడియోలో ఉంది. దీనిపై ప్రశ్నించగా, "నేను పిల్లలకు ప్రేమతో చదువు చెబుతాను. వారితో కాసేపు కాళ్లు, చేతులు నొక్కించుకుంటే ఏమవుతుంది? అని టీచర్ బదులిచ్చినట్లు వీడియోలో కన్పిస్తోంది.
(School teacher) టీచర్ సుమన్ క్లాస్ రూమ్ లోపల బెంచ్ మీద కాళ్లు పెట్టుకోని కూర్చుని ఉండగా.. విద్యార్థి తన చేతులు, కాళ్లు నొక్కుతోంది. ఇది గమనించిన స్థానిక వ్యక్తి వీడియో తీసి.. అతడిని ప్రశ్నించారు. వీడియో వైరల్ కావడంతో గ్రామస్తులు ఉపాద్యాయుడిపై మండిపడ్డారు. పిల్లల భవిష్యత్తుకు బాధ్యత వహించే టీచర్లే ఈ విధంగా తప్పులు చేస్తున్నారని అన్నారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయంగా మారండంతో పై అధికారులకు చేరింది.
వైరల్ వీడియోపై బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (బీడీఓ) ప్రియాంక కుమారి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన వరకు వీడియో చేరిందని, దాన్ని తాను కూడా చూసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత ఉపాధ్యాయుడి నుంచి వివరణ కోరినట్లు తెలిపారు. అతనిపై శాఖాపరమైన చర్య కోసం లేఖ పంపినట్లు వెల్లడించారు. దర్యాప్తు తర్వాత ఉపాధ్యాయుడు దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.






