Tarrifs: సుంకాలు తగ్గించకపోతే ఇబ్బందులు తప్పవు.. భారత్‌కు అమెరికా వార్నింగ్

by B.Srinivas |

సుంకాలపై కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Tarrifs: సుంకాలు తగ్గించకపోతే ఇబ్బందులు తప్పవు.. భారత్‌కు అమెరికా వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: సుంకాలపై కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ (Howard lutnck) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా తన సుంకాలను తగ్గించాల్సి ఉంటుందని, లేకుంటే అమెరికాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుందని హెచ్చరించారు. భారత్ 1.4 బిలియన్ల జనాభా అని గొప్పలు చెబుతుందని, కానీ అమెరికన్ మొక్కజొన్నను ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. 140 కోట్ల మంది జనాభా అమెరికా నుంచి ఒక బుషెల్ మొక్కజొన్నను ఎందుకు కొనరు? వారు తమకు అన్నీ అమ్మేసి మొక్కజొన్నను కొనకపోవడం ఆశ్చర్యంగా ఉంటుందన్నారు.

ఇండియా అమెరికన్ వస్తువులను పరిమితం చేస్తూనే యూఎస్ మార్కెట్‌ను సద్వినియోగం చేసుకుని ద్వారా ప్రయోజనం పొందుతుందన్నారు. వారు ప్రతిదానిపైనా సుంకాలు విధిస్తున్నారని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ న్యాయమైన, పరస్పర వాణిజ్యాన్ని మాత్రమే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. భారత్ తమతో ఎలా వ్యవహరిస్తుందో వారితోనూ అలాగే ప్రవర్తిస్తామన్నారు. భారత్‌తో అనేక ఏళ్లుగా జరుగుతున్న తప్పులను సరిదిద్దుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తుందని చెప్పారు. కాగా, భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలను విధించిన విషయం తెలిసిందే.

Next Story