Tarrif: రష్యా చమురు కొంటే 500 శాతం టారిఫ్.. అమెరికా నిర్ణయంతో భారత్‌కు షాక్

by B.Srinivas |

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్ సహా ఇతర దేశాలపై 500 శాతం టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.

Tarrif: రష్యా చమురు కొంటే 500 శాతం టారిఫ్.. అమెరికా నిర్ణయంతో భారత్‌కు షాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్ సహా ఇతర దేశాలపై 500 శాతం టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. రష్యా ఆంక్షల బిల్లును మద్దతిచ్చే విషయంపై తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. కేబినెట్ సమావేశంలో భాగంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించేలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ‘సాంక్షనింగ్ రష్యా యాక్ట్ 2025’ పేరుతో బిల్లును ప్రవేశపెట్టేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు, గ్యాస్, ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై అత్యంత కఠినమైన సుంకం విధించడమే ఈ బిల్లు లక్ష్యం. దీంతో అమెరికా నిర్ణయంతో భారత్ పై తీవ్ర ప్రభావం పడే చాన్స్ ఉంది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి భారత్ రష్యా నుంచి ఎక్కువగా చమురు కొనుగోలు చేస్తుంది. రష్యన్ చమురులో దాదాపు 35 శాతం కొనుగోలు చేస్తున్నది.

ట్రంప్ ప్రకటనపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. రష్యా చమురు కొనడం వల్ల ప్రపంచానికి మేలే జరిగిందని, లేదంటే చమురు ధరలు మోతమోగేవని తెలిపారు. రష్యన్ చమురుపై ప్రపంచ ఆంక్షలు ఎప్పుడూ లేవన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా వాస్తవికతలను తెలుసుకుని భారత్ సాధ్యమైన చోటల్లా ఒక నిర్దిష్ట ధర పరిధిలో సబ్సిడీ చమురును కొనుగోలు చేస్తుందని, ఈ చర్య ప్రపంచ మార్కెట్లకు ఎంతో సహాయం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచ చమురు మార్కెట్‌ను స్థిరంగా ఉంచడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

Next Story