Tariffs: ఏప్రిల్ 2 నుంచి భారత్‌పై రివేంజ్ టారిఫ్స్.. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి

by B.Srinivas |

భారత్‌పై ఏప్రిల్ 2వ తేదీ నుంచి రివేంజ్ టారిఫ్స్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

Tariffs: ఏప్రిల్ 2 నుంచి భారత్‌పై రివేంజ్ టారిఫ్స్.. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌పై ఏప్రిల్ 2వ తేదీ నుంచి రివేంజ్ టారిఫ్స్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. భారత్ యూఎస్ నుంచి వంద శాతం కంటే ఎక్కువ సుంకాలు వసూలు చేస్తుందని, తాము కూడా అదే విధంగా సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి నిర్వహించిన కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ఇతర దేశాలు అనేక దశాబ్దాలుగా అమెరికాపై భారీ సుంకాలను ఉపయోగిస్తున్నాయని, ఇప్పడు ఆ దేశాలపై సైతం సుంకాలు వేసే సమయం ఆసన్నమైందని తెలిపారు. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారత్, మెక్సికో, కెనడా వంటి దేశాలు యూఎస్ వసూలు చేసే దానికంటే చాలా ఎక్కువ సుంకాలను అమలు చేస్తున్నాయని, ఇది చాలా అన్యాయమని చెప్పారు. అందుకే ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు విధిస్తామని నొక్కి చెప్పారు. దీనివల్ల అమెరికా మరింత సంపన్నంగా మారే అవకాశం ఉంటుందని అశాభావం వ్యక్తం చేశారు.

జో బైడెన్ అత్యంత చెత్త అధ్యక్షుడు

మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పై ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్ అని ఆరోపించారు. ఆయన హయాంలో ప్రతి నెల అనేక అక్రమ వలసలు జరిగాయని మండిపడ్డారు. తాను ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనూ దక్షిణ సరిహద్దులో అత్యవసర పరిస్థితిని ప్రకటించి అక్రమ వలసలను నియంత్రించానని తెలిపారు. ఫలితంగా, గత నెలలో అక్రమంగా బార్డర్ దాటే వారి సంఖ్య భారీగా తగ్గిందన్నారు. బైడెన్ విధానాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిందని తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ అంశంపై ఇప్పటికే రష్యాతో చర్చలు జరిపామని చెప్పారు.

Next Story