- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tariffs : అమెరికాపై టారీఫ్ ల అంశంపై స్పందించిన విదేశాంగ శాఖ
సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. అమెరికాతో చర్చల్లో సుంకాల ప్రస్తావన రాలేదని స్పష్టం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. అమెరికాతో చర్చల్లో సుంకాల ప్రస్తావన రాలేదని స్పష్టం చేసింది. "ఈ ప్రత్యేక అంశంపై మా వైఖరి బాగా వ్యక్తమైంది. మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుండి మే 10న జరిగిన కాల్పుల విరమణ సమయం వరకు అమెరికాతో కేవలం సైనికపరమైన చర్చలే జరిగాయి. అభివృద్ధి చెందుతున్న సైనిక పరిస్థితిపై భారత్, యూఎస్ మధ్య సంభాషణ జరిగింది. చర్చల సమయంలో సుంకాల అంశం ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదు" అని విదేశంగా శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. 90 రోజుల పరస్పర సుంకాల విరామం తర్వాత వాణిజ్య ఒప్పందానికి తుది మెరుగులు దిద్దుతున్నందున సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం.
ట్రంప్ కు షాక్..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి న్యాయపరంగా ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఏప్రిల్ 2న ప్రకటించిన "లిబరేషన్ డే" ప్రతీకగా విధించిన టారిఫ్‌లపై బుధవారం అమెరికా ట్రేడ్ కోర్టు స్టే విధించింది. అమెరికా తరపున ఎక్కువ మొత్తంలో వస్తువులు విక్రయిస్తున్నప్పటికీ, అమెరికా మాత్రం వాటి నుంచి తక్కువగా కొనుగోలు చేస్తోందని పేర్కొంటూ ట్రంప్ ఈ టారిఫ్‌లను విధించారు. అంతేకాదు, ఈ టారిఫ్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయని, తాజాగా భారత్- పాకిస్థాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గిన విషయాన్ని ట్రంప్ ప్రభుత్వం ప్రస్తావించినా, కోర్టు దానిని పరిగణనలోకి తీసుకోలేదు. టారిఫ్‌ల వల్ల భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాయని ట్రంప్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మరోవైపు, ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర లోని పహెల్గామ్‌లో ఉగ్రదాడి జరిగింది. అయితే, తాను మధ్యవర్తిత్వం చేసి,టారిఫ్‌ల ప్రోత్సాహంతో కాల్పుల విరమణ జరగిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాల వేళ విదేశాంగ శాఖ స్పందించడం గమనార్హం.






