- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ సభలో తొక్కిసలాట.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు
కరూర్ తొక్కిసలాట ఘటన(Karur Stampede Incident)పై తమిళనాడు హైకోర్టు(Tamil Nadu High Court) కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: కరూర్ తొక్కిసలాట ఘటన(Karur Stampede Incident)పై తమిళనాడు హైకోర్టు(Tamil Nadu High Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనపై సిట్ విచారణకు ఆదేశించింది. ఘటన తర్వాత టీవీకే పార్టీ(TVK Party) నేతలు ఎక్కడికి వెళ్లారు?, బాధితులను ఎందుకు పట్టించుకోలేదని మద్రాసు హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. విజయ్ వాహనాన్ని కూడా సీజ్ చేయలేదని మండిపడింది. ఈ సందర్భంగా టీవీకే పార్టీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ విజయ్ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌పై శుక్రవారం మదురై బెంచ్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా విజయ్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఇటీవల నటుడు దళపతి విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురు టీవీకే పార్టీ నేతలను అరెస్టు చేసి విచారిస్తున్నది.






