పూల మాల కాదు.. వెల్లుల్లి దండలు! తమిళ నటుల వినూత్న కానుక ఎందుకంటే?

by Disha Web Desk 14 |
పూల మాల కాదు.. వెల్లుల్లి దండలు! తమిళ నటుల వినూత్న కానుక ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు ఘాటెక్కిపోతున్నాయి. దాదాపు కిలో రూ. 500 పైగా పలుకుతోంది. పచ్చళ్ల సీజన్‌ ప్రారంభం అవుతుండటంతో వెల్లుల్లికి డిమాండ్‌ పెరిగింది. గత ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురవడంతో పంట దెబ్బతిని ఉత్పత్తి తగ్గింది. దీంతో ధరల పెరుగుదలకు దారి తీసి.. సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే తమిళ నటులు వినూత్న తీరులో వెల్లుల్లిని గిఫ్ట్‌గా పంపారు.

సేలంలోని అమ్మాపేట కాలనీలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన తమిళ సినీ నటులు బెంజమిన్, మహమ్మద్ కాశీం వధూవరులకు రెండు వెల్లుల్లి దండలను, రెండు కిలోల వెల్లుల్లిని బహుమానంగా అందించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమం తమిళనాట వైరల్ అయింది. వెల్లుల్లి ధరలు పెరగడంతో వధూవరలకు రెండు కిలోల వెల్లుల్లి గిఫ్ట్‌గా ఇచ్చారు.

Next Story