- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై టీ బీజేపీ రాంచందర్ రావు కౌంటర్
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై పెరుగుతున్న హింసను ఖండిస్తూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై పెరుగుతున్న హింసను ఖండిస్తూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (MP Priyanka Gandhi) వాద్రా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు (Ramchandra Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులు పడుతున్న బాధల గురించి ప్రియాంక గాంధీ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా ఇటువంటి ప్రకటన చేయడం చూస్తుంటే, ఇప్పటికైనా వారికి హిందువుల కష్టాలు అర్థమైనందుకు సంతోషంగా ఉందని ఎద్దేవా చేశారు. నిజానికి కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ హిందూ ధర్మం పై దాడి చేసేవారికి, భారతీయ మూలాలకు వ్యతిరేకంగా ఉండేవారికే మద్దతు ఇస్తుంటారని ఆయన ఆరోపించారు.
బంగ్లాదేశ్ హిందువుల భద్రత గురించి మాట్లాడటమే కాకుండా, మన దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న బంగ్లాదేశీయులను కూడా ప్రియాంక గాంధీ వ్యతిరేకించాలని రాంచందర్ రావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. భారత ఓటర్ల జాబితా నుంచి అక్రమ వలసదారుల పేర్లను తొలగించడానికి ఆమె మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే భారత్‌లో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ ఉగ్రవాదులను, ఇతర ఉగ్రవాద మూలాలను కాంగ్రెస్ నాయకులు ఖండించాలని, అటువంటి శక్తులను ప్రోత్సహించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.






