- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం.. వరుడు సహా 8 మంది దుర్మరణం
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని సంభాల్ జిల్లాలో జరిగిన కారుప్రమాదంలో 24 సంవత్సరాల వరుడు సహా.. 8 మంది మరణించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని సంభాల్ జిల్లాలో జరిగిన కారుప్రమాదంలో 24 సంవత్సరాల వరుడు సహా.. 8 మంది మరణించారు. శుక్రవారం పెళ్లి బృందంతో వెళ్తోన్న బొలెరో SUV కారు కాలేజీ గోడను ఢీ కొట్టింది. జెవానై గ్రామంలో (Jewanai Village) ఉదయం 6.30 గంటల సమయంలో జనతా ఇంటర్ కాలేజీ సమీపంలో బొలెరో కారు అధికవేగంతో ప్రయాణిస్తుండగా.. డ్రైవర్ దానిపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు కాలేజీ సరిహద్దు గోడను ఢీ కొట్టి బోల్తా పడింది.
పెళ్లి బృందం సంభాల్ లోని హర్ గోవింద్ పూర్ గ్రామం నుంచి పొరుగున ఉన్న బుడాన్ జిల్లాలోని సిర్టౌల్ లోని వధువు గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో 10 మంది ఉండగా.. ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురికి గాయాలవ్వగా ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగా.. ముగ్గురు మరణించారు. ప్రస్తుతం ఇద్దరికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతుండగా.. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు అలీఘర్ లోని ఉన్నత వైద్యకేంద్రం డాక్టర్లు తెలిపారు.
మృతులు.. వరుడు సూరజ్ (24), వరుడి వదిన ఆశా (26), ఆశా కుమార్తె ఐశ్వర్య (2), మనోజ్ కుమారుడు విష్ణు (6), వరుడి అత్త, ఇద్దరు మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. కాగా.. బొలెరోలో 10 మంది ప్రయాణించడం దాని సామర్థ్యానికి మించినదేనని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






