కంగనా రనౌత్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. పిటిషన్ కొట్టివేత

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-12 08:14:36  IST  )

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut)పై సుప్రీంకోర్టు (Supreme Court) సీరియస్ అయింది.

కంగనా రనౌత్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. పిటిషన్ కొట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut)పై సుప్రీంకోర్టు (Supreme Court) సీరియస్ అయింది. ఆమెపై దాఖలైన పరువునష్టం పిటిషన్ పై శుక్రవారం విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. మీరు అగ్నికి ఆజ్యం పోశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2020-21 రైతుల ఉద్యమానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో ఆమెపై దాఖలైన పిటిషన్ ను కొట్టివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో కంగనా సుప్రీంను ఆశ్రయించింది. పిటిషన్ పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మోహతాల ధర్మాసనం విచారణ జరిపింది. రైతుల ఉద్యమం ఆమె చేసింది కేవలం రీట్వీట్ మాత్రమే కాదని.. దానికి మసాలా జోడించారని ఆగ్రహించింది. తనపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

పంజాబ్‌లోని బతిండా జిల్లాకు చెందిన 73 ఏళ్ల మహీందర్ కౌర్ మండి బీజేపీ ఎంపి కంగనా రనౌత్ పై పరువునష్టం దావా దాఖలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 2019లో ఢిల్లీలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న "షాహీన్ బాగ్ దాది బిల్కిస్" అని తప్పుగా పేర్కొంటూ రనౌత్ తన పరువును హరించారని ఆమె ఆరోపించింది.

Next Story