- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిల్లులు నిలిపివేయడమే గవర్నర్‌కు ఉన్న అధికారమా?
ఎలాంటి సమాధానం ఇవ్వకుండా బిల్లులను నిలిపి వేయడమే గవర్నర్ అంతిమ నిర్ణయంగా పరిగణించాలా అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది

- గవర్నర్ అధికారాలను సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది
- తమిళనాడు ప్రభుత్వ పిటిషన్లు విచారించిన సుప్రీంకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కీలకమైన బిల్లులపై సమాధానం చెప్పకుండా తన వద్దే అట్టిపెట్టుకుంటున్నాడని.. పునఃపరిశీలించి పంపిన బిల్లులపై మౌనంగా ఉంటున్నారని.. వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను ఆదేశించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టి.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి సమాధానం ఇవ్వకుండా బిల్లులను నిలిపి వేయడమే గవర్నర్ అంతిమ నిర్ణయంగా పరిగణించాలా అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను నిరవధికంగా నిలిపివేయడానికి గవర్నర్‌కు ఎలాంటి విచక్షణ అధికారం లేదని పిటిషనర్ల తరపు అడ్వొకేట్ రాకేశ్ ద్వివేది వాదించారు. 2024 నవంబర్ 18న తమిళనాడు అసెంబ్లీ బిల్లులను పునర్‌పరిశీలించి గవర్నర్ వద్దకు పంపిందని.. అదే ఏడాది నవంబర్ 28న గవర్నర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందిందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొని వెళ్లారు. ఆ లేఖలో బిల్లులను సమ్మతిస్తున్నానని గానీ, సమ్మతించడం లేదని గానీ పేర్కొన లేదని చెప్పారు. బిల్లులను నిలిపివేసిన కారణాలను కూడా ఆ లేఖలో పేర్కొనలేదని సుప్రీంకోర్టుకు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సందేశాన్ని పంపలేదని తాము నమ్ముతున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. గవర్నర్ ఆ లేఖలో బిల్లులను తిప్పి పంపుతున్నట్లు కూడా పేర్కొనలేదని చెప్పింది. బిల్లులను ఆమోదించ ఉంటే.. వాటిని లేఖతో జత చేసేవారని.. కానీ ఆ విధంగా చేయలేదని కోర్టు విశ్వసిస్తున్నట్లు తెలిపింది. గవర్నర్ రవి బిల్లులను నిలిపివేయడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎందుకు ఆయన మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించింది. ప్రభుత్వంతో ఎందుకు సంప్రదింపులు జరపడం లేదు. అసెంబ్లీలో తిరిగి ఆమోదం పొందిన బిల్లులను ఆవేసి.. తిరిగి రాష్ట్రపతి పరిశీలనకు ఎలా పంపవచ్చని గవర్నర్ తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాగా, ఈ వ్యవహారంపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.






