Supreme court: బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి ప్రశ్నలు.. విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

by B.Srinivas |

రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై ముర్ము లేవనెత్తిన ప్రశ్నలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.

Supreme court: బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి ప్రశ్నలు.. విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి తీసుకోవాల్సిన చర్యలపై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము (Droupadi murmur) లేవనెత్తిన 14 ప్రశ్నలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. సీజేఐ బీఆర్ గవాయ్ (BR gawai) నేతృత్వంలోని న్యాయమూర్తులు సూర్యకాంత్, విక్రమ్ నాథ్, పీఎస్ నరసింహ, ఏఎస్ చందూర్కర్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టులో ఈ అంశంపై సమగ్రంగా విచారణ చేపడతామని తెలిపింది. జూలై 29న కోర్టు విచారణ షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులపై ఆయా రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై స్పందించిన ముర్ము కోర్టును పలు ప్రశ్నలు అడిగారు. దీనిపై న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ అంశంపై ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

Next Story